News January 4, 2026
విశాఖ: జలాంతర్గామిని సందర్శించిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. నౌకా దళంలో కీలకంగా ఉన్న INS హిమగిరితోపాటు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని పరిశీలించారు. దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా సాధిస్తున్న పురోగతికి ఈ నౌకలు ప్రతీకలని గవర్నర్ ప్రశంసించారు.
Similar News
News February 2, 2026
తిరుపతి: రెండో రోజు 179 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు RIO రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెండో రోజు 90 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు ఉదయం 5275 మందికి గాను 98 మంది గైర్హాజరై 5177 మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 4661 మందికి 81 మంది గైర్హాజరు కాగా 4580 మంది పరీక్షలు రాశారు. ఈనెల 10 వరకు ఓకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
News February 2, 2026
‘ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలి’

జిల్లాలోని పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్తను సేకరించాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మండలాల వారీగా సమీక్షించారు. కనీసం 75 శాతం చెత్త సేకరణ చేసి త్వరలో 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా అమలు చేయాలని అన్నారు.
News February 2, 2026
KMR: ఏడుగురు నామినేషన్ల ఉపసంహరణ

కామారెడ్డి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు, బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు, స్వతంత్రులు ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ వెల్లడించారు.


