News January 4, 2026
MNCL: వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. గద్దెరాగడికి చెందిన నాగేందర్ శర్మ శనివారం సాయంత్రం ఏసీసీ వైపు వాకింగ్‌కు వెళ్తుండగా లడ్డా రైస్ మిల్లు వద్ద ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మజ్హరుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 20, 2026
22A నిషేధిత భూములపై మంత్రి కీలక ప్రకటన

AP: రాష్ట్రంలో 22A నిషేధిత భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. ఆ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించే అధికారం RDOలకు అప్పగిస్తామన్నారు. భూమిని 22Aలో చేర్చాలంటే ఆ పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు/eKYC ద్వారా నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. పదేళ్ల కిందట అసైన్డ్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించబోతున్నామని చెప్పారు.
News February 20, 2026
MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.
News February 20, 2026
AI SUMMIT: రాహుల్ విమర్శ.. థరూర్ ప్రశంస!

కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదేనని మరోసారి నిరూపితమైంది. AI సమ్మిట్ లోపాలతో మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేసిందని రాహుల్ మండిపడటం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా సమ్మిట్ బాగా జరిగిందని INC MP థరూర్ పొగిడారు. కొన్ని లోపాలు సహజమన్నారు. గతంలోనూ థరూర్ NDA ప్రభుత్వాన్ని మెచ్చుకోగా పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. ఇటీవలే అవి సమసి ఆయనకు కేరళ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.


