News January 4, 2026
రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News January 21, 2026
దావోస్‌లో సీఎం రేవంత్, చిరంజీవి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్‌ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.
News January 21, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
అనకాపల్లి: పాఠాలు చెప్తు కుప్పకూలిన టీచర్

రావికమతం మండలం కొత్తకోట జడ్పీ హైస్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ పూడి మానీలు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం పాఠశాలలో విధులు నిర్వహిస్తుండగా చాతిలో నెప్పి రావడంతో కొత్తకోట పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్య నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మానీలుది కొత్తకోట స్వగ్రామం, ఈయన మృతిపై పులువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


