News April 25, 2024
కెమెరాలు చూస్తున్నాయ్.. జాగ్రత్త!

NLR: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా నిబంధనల ఉల్లంఘనుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు బిగించిన వాహనాలు కూడా రోడ్డెక్కాయి. ఈసీ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం డేగ కళ్లతో వేటాడుతున్నాయి.
Similar News
News October 12, 2025
జిల్లా యువజన వారోత్సవాలకు ఆహ్వానం: సెట్నల్

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 23వ తేదీన DKW కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి యువజన వారోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్నల్ సీఈవో నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారికి ఫోక్ డ్యాన్స్, గ్రూప్ ఫోక్ సాంగ్, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, పొయెట్రీ రైటింగ్ పలు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు.
News October 12, 2025
నిబంధనలు అతిక్రమించి బాణసంచా తయారీ చేస్తే చర్యలు : SP

నెల్లూరు జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని నెల్లూరు జిల్లా SP అజిత తెలిపారు. టపాసుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టపాసులు అక్రమ నిల్వలు ఉన్నాయనే కారణాలతో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, విడవలూరు పరిధిలో-1 కేసు, కందుకూరు టౌన్ స్టేషన్ పరిధిలో-1 కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.
News October 12, 2025
కలువాయి: వృద్ధ దంపతుల ఆత్మహత్య

కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన వృద్ధ దంపతులు వింజం కొండయ్య, వింజం రత్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో విష గుళికలు తిని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది