News January 4, 2026
10 నిమిషాల్లోనే డెలివరీ అయిపోవాలా?

డెలివరీ ఏజెంట్ల <<18740820>>నిరసనతో<<>> క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల’ డెలివరీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజార్టీ వినియోగదారులు ఇది అవసరం లేదంటున్నారు. మెడిసిన్స్ మినహా ఇతర సరుకులు ఆలస్యమైనా మునిగిపోయేదేం లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం 10 నిమిషాల్లో డెలివరీ ఉండాల్సిందేనని వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? COMMENT
Similar News
News February 17, 2026
నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
News February 17, 2026
బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
News February 17, 2026
లెజెండరీ నటుడు కన్నుమూత!

హాలీవుడ్ లెజెండరీ నటుడు రాబర్ట్ డువల్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన 60 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 100 చిత్రాల్లో ఆయన నటించారు. హాలీవుడ్ గ్రేట్ మూవీస్ ‘ది గాడ్ ఫాదర్’, ‘ది గాడ్ ఫాదర్-2’లో కనిపించారు. టెండర్ మెర్సీస్ సినిమాకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. మరో 6 సార్లు నామినేట్ అయ్యారు.


