News January 4, 2026

రాష్ట్రస్థాయి హాకీలో నల్గొండ జట్టుకు మూడో స్థానం

image

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు సత్తా చాటింది. మూడో స్థానం కోసం నిజామాబాద్‌తో జరిగిన పోరులో 2-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని రాకేష్, అఖిల్ నందన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ యావర్‌ను డీఈఓ భిక్షపతి, డీవైఎస్‌ఓ అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హిమాం ఖరీం, ఎస్జీఎఫ్ కార్యదర్శి నర్సి రెడ్డి అభినందించారు.

Similar News

News February 2, 2026

మజ్లిస్ మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదు: అసదుద్దీన్

image

నల్గొండలో ఎంఐఎం మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను అక్రమార్కుల నుంచి కాపాడిన ఘనత తమదేనని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని, తమ అనుమతి లేకుండా అధికారం దక్కదని ధీమా వ్యక్తం చేశారు.

News February 1, 2026

మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రచార హోరు!

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా సీఎం స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే స్థానిక నేతలు సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

News February 1, 2026

NLG: పెన్షన్ కోసం టెన్షన్..

image

ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో జాప్యం చేయడంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి సుమారు 2.04 లక్షలు ఉండగా, వీటి పంపిణీకి నెలకు సుమారు రూ. 47.34 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్, జనవరికి సంబంధించిన పెన్షన్లు ఇంకా పంపిణీ కాకపోవడంతో పెన్షన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.