News January 5, 2026
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2026 అదిరిపోయే ప్లాన్ !

HYDలో నిర్వహించనున్న లిటరరీ ఫెస్టివల్ ఈసారి వినూత్నంగా ‘ట్రెజర్ హంట్’ను ప్లాన్ చేసింది. JAN 11న ఉ.6 గంటలకు ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఈ కార్యక్రమం మొదలవుతుంది. నలుగురు సభ్యులతో కూడిన టీమ్(ఒక మహిళ, చిన్నారి తప్పనిసరి) క్లూ పాయింట్లను ఛేదిస్తూ సాహిత్య ప్రియులు నగర అన్వేషణ చేయనున్నారు. సాహిత్యంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా ఈ అడ్వెంచర్‌ను రూపొందించారు. HLF ఈనెల 24-26 వరకు హైటెక్ సిటీలో జరగనుంది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.