News January 5, 2026
కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News February 6, 2026
బందరు పోర్టుకు రూ.573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు..!

బందరు పోర్టు అభివృద్ధికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH-65, NH-216 జంక్షన్‌లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లైన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.
News February 6, 2026
కృష్ణా: టిడిపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేడే

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News February 6, 2026
కృష్ణా: గ్రేట్.. అంధత్వాన్ని జయించి గ్రూప్-2 కొట్టి!

చల్లపల్లి(M) శివరాందుర్గాపురానికి చెందిన అంధ యువకుడు నాగరాజు అసాధారణ పట్టుదలతో గ్రూప్-2 విజేతగా నిలిచారు. 2010లో జరిగిన ప్రమాదంలో చూపు కోల్పోయినా అధైర్యపడకుండా, ఒంగోలు అంధుల పాఠశాలలో విద్యనభ్యసించి MA పూర్తి చేశారు. గ్రూప్-2 ఫలితాల్లో HOD విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. గతంలో CM చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న ఆయన, భవిష్యత్తులో గెజిటెడ్ అధికారి కావడమే తన లక్ష్యమన్నారు.


