News April 25, 2024
ప్రత్తిపాటి పుల్లారావుపై 13 కేసులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందజేసిన అఫిడవిట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్ల కాలంలో ఆయనపై 13 కేసులు నమోదయ్యాయి. పుల్లారావు పేరుతో చరాస్తులు రూ.55.70 కోట్లు, స్థిరాస్తులు రూ.15.51 కోట్లు, అప్పులు రూ.35.90 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 12, 2026
అమరావతి: ‘నాణ్యతతో హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలి’

అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను AGICL ఎండీ SVR శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) ఇన్‌ఫ్రా, హైకోర్టు సైట్‌లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు భవన సముదాయాన్ని లక్ష్యానికి అనుగుణంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: జేసీ

గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అవసరం లేకుండా రీఫిల్ బుకింగ్ చేయవద్దన్నారు. గుంటూరులో తనిఖీల్లో వ్యాపార సంస్థల్లో వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.