News April 25, 2024

తాండూర్: పోలీస్ విధులకు ఆటంకం.. ఏడుగురి రిమాండ్

image

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జగదీష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు తాండూర్ పోలీసు స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కేసు నమోదు కాగా మంగళవారం రిమాండ్ కు తరలించారు.

Similar News

News March 12, 2026

కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భీంపూర్, అర్లి కరంజీ మీదుగా మహూర్ వరకు NH-44 (బోరాజ్)ను అప్‌గ్రేడ్ చేయడం, భీంపూర్-కరంజీ రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మావాలా నుంచి చందా వరకు ఉన్న పాత NH-7 విస్తరణ అభివృద్ధి, ఉపస్నాల వరకు NH-44ను నాలుగు లైన్లుగా మార్చడం గురించి చర్చించారు. చర్యలకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.

News March 11, 2026

రెండు దశల్లో జనగణన: ADB అదనపు కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన జరుగుతుందని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 226 నుంచి జూన్ 9, 2026 వరకు జరుగుతుందన్నారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితరంగా 33 అంశాలపై సమాచారం సేకరిస్తారని చెప్పారు. రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారన్నారు.

News March 11, 2026

ఆదిలాబాద్: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,888 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.