News April 25, 2024
నియోజకవర్గంలో హిందూపురం ఓటర్లే అధికం

హిందూపురం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,46,002 మంది కాగా వీరిలో పురుష ఓటర్లు 1,23,752, మహిళలు 1,22,232, ఇతరులు 18మంది ఉన్నారు. హిందూపురం పట్టణంలో 1,26,488మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 1,19,514 మంది ఉన్నారు. హిందూపురంలో గెలుపునకు పట్టణ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో అనంతపురం యువతికి 981 మార్కులు

శెట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన పాలబండ్ల హనుమంతరెడ్డి, పాలబండ్ల కుమారి దంపతుల కుమార్తె శశిలేఖ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువతి ఎంపీసీలో 1000 మార్కులకు గానూ 981 మార్కులు సాధించారు. శశి లేఖని ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.
News April 22, 2025
రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.