News April 25, 2024
జగిత్యాల జిల్లా స్పెషల్.. ముగ్గురు ఎంపీలు

జగిత్యాల జిల్లా మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ సెగ్మెంట్‌లోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలో ఉంది.
Similar News
News September 12, 2025
కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా రమేశ్

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.
News September 11, 2025
కరీంనగర్: నిరుపయోగంగా నూతన అంబేడ్కర్ భవనం

కరీంనగర్ పరిధి చింతకుంటలో నిర్మించిన నూతన అంబేడ్కర్ భవనం ప్రారంభమై, సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News September 11, 2025
KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్‌లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.