News January 5, 2026

T20 WCలో భారత్‌కు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

image

రానున్న T20 WCలో భారత జట్టులో హార్దిక్ పాండ్య కీ ప్లేయర్ అని SA క్రికెట్ దిగ్గజం డివిలియర్స్ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరని కొనియాడారు. పాండ్య జట్టులో ఉండటం కెప్టెన్ సూర్యకు పెద్ద ఆస్తి అని తెలిపారు. హార్దిక్ నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఓటమి ఖాయమని చెప్పారు. ఇటీవల VHTలో పాండ్య ఒకే ఓవర్లో 5 సిక్సులు బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

Similar News

News January 12, 2026

18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

image

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.

News January 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

News January 12, 2026

BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

image

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.