News April 25, 2024

నిడదవోలు: గెలుపు ముంగిట నిలిచేదెవరు?

image

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్‌గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 12, 2026

కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.

News March 12, 2026

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

image

కాలిఫోర్నియాపై ఇరాన్ డ్రోన్ దాడి చేసే అవకాశం ఉందని అక్కడి పోలీసులను FBI అలర్ట్ చేసినట్లు ABC న్యూస్ పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన మొదట్లో ఈ వార్నింగ్స్ ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందనే సమాచారం మాత్రం తమ దగ్గర లేదని FBI పేర్కొంది. అయితే ఇరాన్ యుద్ధ నౌకలు ధ్వంసమైన నేపథ్యంలో ఆ దేశ డ్రోన్లు ఇప్పుడు అంతదూరం చేరుకునే అవకాశం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

News March 12, 2026

మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి!

image

ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. మార్చి 31లోపు సరైన ఇన్వెస్ట్‌మెంట్లతో పన్ను ఆదా చేసుకోండి. 80C కింద ELSS, PPFలలో ₹1.5 లక్షల వరకు, NPS (80CCD) ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియానికి ₹50 వేలు, 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే 80G కింద విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.