News January 5, 2026

పిట్లం శివారులో రోడ్డు ప్రమాదం

image

పిట్లం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వివరాలిలా.. చిన్నకొడప్గల్ వాసి బుచ్చయ్య పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై పిట్లం వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా, ఒక్కసారిగా ఓ గేదె అడ్డు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి బుచ్చయ్య కింద పడిపోయాడు. ఆయనకు స్వల్ప గాయం కాగా, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 9, 2026

మార్చి 31న సెలవు రద్దు: RBI

image

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్‌ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.

News February 9, 2026

కర్నూలు: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూ!

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 10న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 11 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని చెప్పారు.

News February 9, 2026

ఉయ్యూరు తిరునాళ్లలో జనసంద్రం!

image

కృష్ణాజిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. చివరి ఆదివారం కావడంతో సుమారు 60 వేల-80 వేల మంది దర్శనాలకు వచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 500 మందికి పైగా సిబ్బందితో భద్రత ఏర్పాట్లను చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది.