News April 25, 2024
నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

టీడీపీ టికెట్ ఆశించి బంగపడిన పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు మంగళవారం రాత్రి కలమటను పిలిచి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తామని కలమటకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కలమట ఆయన అనుచరులతో మాట్లాడి, నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
Similar News
News April 22, 2025
శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.
News April 22, 2025
సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.
News April 22, 2025
జలుమూరు: నాడు IPS.. నేడు IAS

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.