News January 5, 2026
గజ్వేల్ అన్నదమ్ములు WORLD RECORD

గజ్వేల్‌కు చెందిన రామకృష్ణ, రఘురాం (అన్నదమ్ములు) హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభ చూపి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 30 నిమిషాలలో 600 కిక్ ఛాలెంజ్‌లో పాల్గొని రికార్డు బద్దలు కొట్టి బంగారు పతకం అందుకున్నారు. తల్లిదండ్రులు రామకోటి రామరాజు-పుష్ప మాట్లాడుతూ.. తనయులు లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తపరిచారు.
Similar News
News February 4, 2026
సిరిసిల్ల: నిధులు తెచ్చే బాధ్యత నాది: బండి సంజయ్

సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధులిస్తానని పీఎం మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా ఛైర్మన్ పీఠాన్ని మాకు అప్పగించండని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తారని, పైసలు మావి, ప్రగతి మాది, సోకులు వాళ్లవని అన్నారు. కమిషన్లు వాళ్లవని, మళ్లీ అలాంటి వారికి ఎలా ఓట్లేస్తారని ఓటర్లను ప్రశ్నించారు.
News February 4, 2026
ఒత్తయిన కనుబొమ్మలకి ఈ చిట్కాలు

– పెట్రోలియం జెల్లీని ఐబ్రోస్‌కి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి.
– మెంతిపిండిలో కొబ్బరినూనె, కొబ్బరి పాలు కలిపిన కనుబొమ్మలకు రాత్రి అప్లై చేసి, ఉదయం శుభ్రం చేసుకోవాలి.
– బాదం నూనెను కనుబొమ్మలకి అప్లై చేసి, మసాజ్ చేసినట్లయితే ఒత్తుగా పెరుగుతాయి. ఇందులో ఉండే విటమిన్-A, B, E కనుబొమ్మలు పెరగటానికి ఉపయోగపడతాయి.
News February 4, 2026
రెవెన్యూ సమస్యలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: మంత్రి

సంబేపల్లి మండలంలో రెవెన్యూ సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తహశీల్దార్, VROలకు సూచించారు. బుధవారం తిరుమలరాయుని గుట్టలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మండల స్థాయిలోనే భూ, రెవెన్యూ సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.


