News January 5, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
Similar News
News February 16, 2026
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
News February 16, 2026
JEE ఫలితాలు వచ్చేశాయ్

జేఈఈ-2026 ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని NITలు, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏపీకి చెందిన నరేంద్రబాబు, పసల మోహిత్, తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు <
News February 16, 2026
హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే ఇవి తినాలి

హార్మోన్లను సమన్వయం చేయాలంటే పిండిపదార్థాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు కలగలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనెలు తీసుకోవాలి. రోజూ రెండు తెల్లగుడ్డుసొనలు, వాల్ నట్స్ తీసుకోవాలి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులను రోజూ తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది.


