News January 5, 2026

HYDలో వాటర్ ప్రాబ్లమా? కాల్ చేయండి

image

నీటి సరఫరా సమస్యలపై స్పందించిన HMWSSB అధికారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. 24×7 కస్టమర్ కేర్ నంబర్లు 155313, 040-23300114కు కాల్ చేయొచ్చని తెలిపారు. అలాగే నీటి సరఫరా, తాగునీరు, డ్రైనేజీ సమస్యల కోసం 99499 30003కు వాట్సాప్ మెసేజ్ పంపితే సంబంధిత సిబ్బంది త్వరితగతిన స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు.

Similar News

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

image

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేద వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

మృత్యువును ఆపిన ‘డెలివరీ’ బాయ్‌.. HYDలో సెల్యూట్

image

నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే ఓ డెలివరీ బాయ్ మానవత్వంలో అందరికంటే ముందున్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ఆర్డర్ చేసిన విషాన్ని డెలివరీ చేయకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నగరంలోని మీడియా జంక్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదంతం చర్చకు రాగా అక్కడి వారంతా లేచి నిలబడి ఆ యువకుడికి సెల్యూట్ చేశారు. ఈ ‘నిజమైన హీరో’ ఇప్పుడు హైదరాబాదీల ప్రశంసలు అందుకుంటున్నాడు.