News January 5, 2026

తూ.గో: సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తుంటే.. మృత్యువు దూసుకొచ్చింది!

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పెండెం చిన్న (15) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి విద్యార్థి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2026

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్‌లో BNP!

image

బంగ్లాదేశ్‌లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్‌పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

News February 13, 2026

MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

image

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 13, 2026

మెదక్: టెన్త్ క్లాస్ టాపర్‌కు బంపర్ ఆఫర్

image

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.