News January 5, 2026

నేడు ‘హిల్ట్’పై చర్చ.. అసలేంటి పాలసీ?

image

TG: ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్(<<18601957>>హిల్ట్<<>>)’పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కాలుష్యాన్ని తగ్గించి సిటీ మధ్యలో ఉన్న పాతబడిన, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం. అలాగే పారిశ్రామిక వాడల్లోని భూములను ఆధునిక నివాస, వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చేయడమే ఉద్దేశంగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. అయితే ఇందులో స్కామ్ జరుగుతోందని BRS <<18457165>>ఆరోపిస్తోంది<<>>.

Similar News

News February 10, 2026

జూన్ తర్వాత ఎల్‌నినో.. ‘నైరుతి’పై ప్రభావం!

image

దేశంలో జూన్ తర్వాత ఎల్‌నినో ఏర్పడేందుకు 50 శాతం ఛాన్స్ ఉందని స్కైమెట్ అంచనా వేసింది. సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో అవకాశం 70 శాతానికి చేరొచ్చని తెలిపింది. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. దీనివల్ల మన దేశంలో వర్షాలు తగ్గిపోతే దక్షిణ అమెరికాలో భారీ వర్షాలు కురుస్తాయి.

News February 10, 2026

లేబర్ కోడ్‌లపై పోరు.. ఎల్లుండి బంద్

image

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన <<18354721>>నాలుగు లేబర్ కోడ్‌లకు<<>> వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నాయి. AP, TG సహా అన్ని రాష్ట్రాల్లోని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఈ లేబర్ కోడ్‌లతో ESI, PF, గ్రాట్యుటీ, పింఛన్‌లకు కార్మికులు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ కోడ్‌లను రద్దు చేసి గతంలోని 29 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

News February 10, 2026

‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’.. కాంగ్రెస్vsబీజేపీ

image

TG: కరీంనగర్ మేయర్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మేయర్ సీటు కోసం కాంగ్రెస్‌-ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అయితే బండి వ్యాఖ్యల్లో నిజం లేదని, డీల్ నిజమైతే జైళ్లో పెట్టాలని లేకపోతే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా దీనిపై విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్ చేశారు.