News January 5, 2026

స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్‌డేట్

image

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.

Similar News

News February 14, 2026

నామినేషన్ కోసమే రూ.8కోట్లు.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమి

image

TG: నామినేషన్ సమయంలో రూ.8కోట్ల పన్ను కట్టిన నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటర్లు షాకిచ్చారు. 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆమె BJP అభ్యర్థి చేతిలో ఓడారు. పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో గెలుపు కోసం ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. తన డివిజన్‌లో ఒక్కో ఓటుకు ₹5వేల వరకు పంచినట్లు సమాచారం. మిగతా డివిజన్లకూ డబ్బు సర్దడంతో ₹20కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

News February 14, 2026

ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు

image

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.

News February 14, 2026

రిటైర్మెంట్ లైఫ్ ఫుల్ సేఫ్.. పెన్షన్‌ + హెల్త్ కవర్‌కు PFRDA ప్లాన్!

image

ఇకపై పెన్షన్ స్కీమ్స్‌తో పాటే హెల్త్ కవర్‌నూ అందించేందుకు PFRDA ప్లాన్ చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది లేకుండా ఇన్వెస్టర్ల డబ్బులో 30% వైద్య అవసరాలకు కేటాయించేలా ‘Swasthya’ ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉంది. పెన్షన్ ఫండ్స్ స్పాన్సర్ చేసే ICICI, Axis, Tata వంటివి దీనిపై కసరత్తు చేస్తున్నాయి. దీంతో తక్కువ ప్రీమియంతోనే ఇన్సూరెన్స్, హాస్పిటల్స్‌లో మంచి డిస్కౌంట్లు లభిస్తాయి.