News April 25, 2024

ఏలూరు జిల్లాలో నామినేషన్ల వివరాలు

image

ఏలూరు ఎంపీ స్థానానికి మంగళవారం 3 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంగుటూరులో 6 సెట్లు, దెందులూరులో 2 సెట్లు, ఏలూరులో 5 సెట్లు, పోలవరంలో 4 సెట్లు, చింతలపూడిలో 2 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 13 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, ఉంగుటూరులో 11, దెందులూరులో 10, ఏలూరులో 12, పోలవరంలో 10, చింతలపూడిలో 9 నామినేషన్లు వచ్చాయి.

Similar News

News January 16, 2026

భీమవరంలో రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం కలకలం

image

భీమవరం-ఉండి రహదారిలోని రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై శుక్రవారం ఓ గుర్తు తెలియని బాలిక(3) మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ చిన్నారి మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన బాలిక గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.

News January 14, 2026

ఖాకీపై ఖద్దరు విజయం.. జిల్లాలో పందెం హోరు!

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో కోడిపందేలకు లైన్ క్లియర్ అయింది. పోలీసుల ఆంక్షలు అమలు కాకపోవడంతో ‘ఖాకీపై ఖద్దరు’ విజయం సాధించినట్లయ్యింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రధాన బరుల వద్ద పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పందెం రాయుళ్లు భారీగా తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది. వచ్చే మూడు రోజుల పాటు ఈ పందెం జాతర కొనసాగనుండగా.. సంప్రదాయం పేరిట జూదం జోరందుకోవడంతో పల్లెలన్నీ పందెం సెగతో ఊగిపోతున్నాయి.

News January 14, 2026

‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

image

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.