News January 5, 2026

సిరిసిల్ల: రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురుచూపు!

image

జిల్లాలో వానాకాలం విక్రయాలు పూర్తికావడంతో రైతాంగం యాసంగి సాగుపై దృష్టి సారించింది. ఇప్పటికే వరి నాట్ల పనులు ముమ్మరం కాగా, అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. అయితే, సాగు ఖర్చులు పెరగడంతో పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 14, 2026

స్టే.ఘ: పదిలో ఒక్కడు!

image

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి ఈనెల 11న ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు పక్రియ ముగిసింది. కాగా, మున్సిపల్ కేంద్రంలోని 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి వార్డు అభ్యర్థి తాటికొండ మధు విజయం సాధించి, పదిమందిలో ఒకడిగా నిలిచాడు.

News February 14, 2026

జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

image

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.

News February 14, 2026

మెదక్: మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ రాహుల్ రాజ్ నలుగురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మెదక్ మున్సిపాలిటీకి ఎల్లయ్య(ZP CEO), రామాయంపేటకు జయచంద్రారెడ్డి(RDO తూప్రాన్), నర్సాపూర్‌కు రమాదేవి(RDO మెదక్), తూప్రాన్‌కు మహిపాల్‌(RDO నర్సాపూర్) అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.