News January 5, 2026

WGL: మున్సిపల్ పోరుకు సై..!

image

మరో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 11న షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 12 మున్సిపాలిటీల్లో 49,051 ఎస్టీ, 69,316 ఎస్సీ జనాభా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, పాత రిజర్వేషన్ల ప్రకారమే జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

Similar News

News February 14, 2026

కార్పొరేషన్లలో ‘కారు’ డౌన్

image

TG: మున్సిపాలిటీల్లో సుమారు 13 చోట్ల గెలిచిన BRS.. కార్పొరేషన్లలో మాత్రం డీలా పడిపోయింది. 7 చోట్ల ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. మొత్తం 414 డివిజన్లలో 63 చోట్ల మాత్రమే విజయం సాధించింది. NZBలో 60 డివిజన్లు ఉండగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెంలో మూడో స్థానానికి పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లో కాస్త ఫర్వాలేదనిపించినా నగర ప్రజలు పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది.

News February 14, 2026

కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

image

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 14, 2026

కర్నూలు: ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో మోసం..వ్యక్తి అరెస్టు

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.