News January 5, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,580 పెరిగి రూ.1,37,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 ఎగబాకి రూ.1,25,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News February 23, 2026
గేమ్స్ వద్దు.. ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

US సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఏ దేశమైనా గేమ్స్ ఆడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా USను దశాబ్దాలుగా టారిఫ్స్‌తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెరికాతో ట్రేడ్ డీల్‌ను EU హోల్డ్ చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News February 23, 2026
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ‘ప్రహార్’ పాలసీని ఆవిష్కరించిన కేంద్రం!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కౌంటర్ టెర్రరిజం పాలసీ ‘ప్రహార్’ను కేంద్రం ఆవిష్కరించింది. సరిహద్దుల్లోని జిహాదీ నెట్‌వర్క్‌లు, సైబర్ దాడులు, డ్రోన్ ఆధారిత స్మగ్లింగ్, క్రిప్టోకరెన్సీ, జీవ&అణు పదార్థాల దుర్వినియోగం, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని రూపొందించింది. టెర్రర్ దాడులను ఆపేందుకు మల్టీ ఏజెన్సీలను వినియోగించనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది.
News February 23, 2026
బ్రూవరీలకు నీరు కట్… బీర్ల ఉత్పత్తిపై ప్రభావం

TG: రాష్ట్రంలో వేసవిలో రోజుకు 2.20L బీర్ల బాక్సులు అమ్ముడవుతుంటాయి. అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి చేయడానికి బ్రూవరీలకు 50L లీటర్ల నీరు అవసరం. అయితే సింగూరు ఆనకట్ట మరమ్మతుల వల్ల ఈసారి బ్రూవరీలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అవి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. లేకుంటే ఉత్పత్తి భారీగా తగ్గనుంది. అదే జరిగితే వీటి అమ్మకంతో ఏటా వచ్చే రూ.4,500 కోట్ల ఆదాయం తగ్గే ఆస్కారముంది.


