News April 25, 2024
MDK: వివాహేతర సంబంధంతో ప్రభుత్వ టీచర్ హత్య

వివాహేతర సంబంధం నెపంతో ప్రభుత్వ <<13110756>>టీచర్ హత్య<<>>కు గురయ్యాడు. చేగుంటలో అద్దెకు ఉంటున్న టీచర్ నాగరాజుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త సత్యనారాయణ అనుమానించాడు. దీంతో నాగరాజును చంపేయాలనుకున్న అతను మరో ఇద్దరితో కలిసి గతనెల 28న అద్దె ఇంట్లోనే చంపేశారు. మరుసటిరోజు వచ్చి కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి HYD శివారులో పడేశారు. కాగా సత్యనారాయణ భార్య ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది.
Similar News
News March 5, 2026
హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 5, 2026
‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 5, 2026
మెదక్: తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

కొల్చారం మండలం సీతారాంపూర్ తండాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మాలావత్ నాని అనే యువకుడు తన తల్లి లక్ష్మిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


