News January 5, 2026

MBNR: త్వరలో ఎన్నికలు.. కొత్త ఓట్లకు NO ఛాన్స్

image

పుర పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త ఓటర్ల నమోదుపై నిషేధం విధించారు. ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో కొత్త ఓటర్ల నమోదు సేవలను నిలిపి వేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు.. పట్టణ స్థానిక సంస్థల్లోకి చొరబడకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తోంది. కాగా ఉమ్మడి MBNRలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 23, 2026

కొత్తగూడెం కార్పొరేషన్.. సౌకర్యాలు అంతంతే..!

image

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ఇటీవల కార్పొరేషన్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్లు, మేయర్, డి.మేయర్ ప్రమాణ స్వీకారం.. పాత కౌన్సిల్ హాల్‌లోనే పూర్తి చేశారు. ఈ నెలలోనే పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సి ఉండగా పాత హల్లోనే పాలకవర్గం నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

News February 23, 2026

కర్నూలులో కెరీర్ గైడెన్స్ సెమినార్ సక్సెస్

image

కర్నూలులోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం Way2News & Resonance సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా కెరీర్ గైడెన్స్ సెమినార్ విజయవంతమైంది. CBI మాజీ JD లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన కల్పించారు. జేడీ సూచనలు తమను ఎంతో ప్రభావితం చేశాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News February 23, 2026

పథకాల అమలులో AI.. అక్రమాలకు చెక్!

image

TG: సంక్షేమ పథకాల అమలులో AI టెక్నాలజీ వాడాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. దీని వల్ల అక్రమాలకు చెక్ పడుతుందని, పథకాలు నిజమైన అర్హులకే చేరుతాయని భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని శాఖల డేటాబేస్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి లింక్ చేస్తారని, లబ్ధిదారుల లిస్టు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని సమాచారం. ఎవరైనా నకిలీ వివరాలతో లబ్ధి పొందాలని చూస్తే డేటా మ్యాచింగ్ ద్వారా ఏఐ గుర్తిస్తుంది.