News January 5, 2026
ఢిల్లీ అల్లర్లు.. అసలు అప్పుడు ఏం జరిగింది?

2020 ఫిబ్రవరిలో CAA చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు ఈశాన్య ఢిల్లీలో తీవ్ర హింసకు దారితీశాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సమయంలో దేశ పరువు తీయడానికి పక్కా ప్లాన్‌తో చేసిన కుట్ర ఇదని పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారు. దీని వెనుక ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఉన్నారని ఆరోపిస్తూ వారిపై UAPA కింద కేసు పెట్టారు.
Similar News
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.
News January 9, 2026
IIT ఇండోర్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 9, 2026
కుబేర యోగం అంటే ఏంటి?

జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ధన యోగాల్లో ‘కుబేర యోగం’ ఒకటి. పేరుకు తగ్గట్టే ఈ యోగం ఉన్న వ్యక్తిపై కుబేరుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. సాధారణంగా రాజయోగాలు అధికారాన్ని ఇస్తే, కుబేర యోగం అంతులేని ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను ప్రసాదిస్తుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన ధనాన్ని స్థిరంగా ఉంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ యోగం ఉన్నవారు సమాజంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందుతారు.


