News January 5, 2026

రాజీనామాపై మరోసారి ఆలోచించండి.. కవితకు ఛైర్మన్ సూచన

image

TG: MLC పదవికి రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని కవితకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సూచించారు. ‘కవిత ఆవేదనను అర్థం చేసుకున్నాం. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు’ అని పేర్కొన్నారు. అయితే తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. వ్యక్తిలా వెళ్లి శక్తిలా తిరిగొస్తానన్నారు.

Similar News

News February 22, 2026

జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

image

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

News February 22, 2026

పండుగ రోజుల్లో ముహూర్తాలు ఎందుకు ఉండవు?

image

ముహూర్త శాస్త్రం ప్రకారం.. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలం. శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి పండుగ తిథులు అశుభ తిథుల కోవలోకి వస్తాయి. లోక కళ్యాణం కోసం దైవం ఆ రోజుల్లో అవతరించినా, సామాన్యుల వ్యక్తిగత కార్యాలకు (వివాహం, గృహప్రవేశం) ఆ తిథి బలం సరిపోదు. అందుకే పండుగ పవిత్రమైనా, శాస్త్రం నిర్దేశించిన తిథి శుద్ధి లేని కారణంగా ముహూర్తాలు నిర్ణయించరు.

News February 22, 2026

IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తు గడువును పెంచింది. అప్లైకి ఫిబ్రవరి 23 ఆఖరు తేదీ కాగా.. మార్చి 4వరకు పొడిగించారు. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in