News January 5, 2026

క్రీడా పోటీల ఏర్పాట్లపై కలెక్టర్ అసంతృప్తి

image

భద్రాద్రి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. పోటీలకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, కొన్ని శాఖల అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా సమన్వయంతో పని చేయాలని స్పష్టంచేశారు

Similar News

News February 19, 2026

NGKL: రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

image

హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, శ్రీ వర్ధన్, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.

News February 19, 2026

అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించాలి: సంగారెడ్డి కలెక్టర్

image

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో సివిల్ వర్క్‌లకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సూచించారు.

News February 19, 2026

KNR: మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

image

తెలంగాణ మెడికల్, హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు నాయక్, సెక్రటరీ రాజగోపాల్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, పిఓడిటి డా.ఉమాశ్రీ తదితులున్నారు.