News January 5, 2026
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సబ్సిడీ ధరతో గోధుమ పిండిని అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆమె ఈ పంపిణీని ప్రారంభించారు. ఇక నుంచి అన్ని రేషన్ షాపుల్లో ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జేసీ సూచించారు.
Similar News
News January 14, 2026
భూపాలపల్లి: విద్యుత్ తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయొద్దు!

విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయవద్దని భూపాలపల్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చైనా మాంజా వాడకం ప్రమాదకరమని, కాటన్ దారం మాత్రమే వాడాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ తీగలు లేని ఖాళీ ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగిరేలా చూడాలన్నారు. ప్రజలందరూ సురక్షితంగా సంక్రాంతి జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
News January 14, 2026
తల్లి బాటలోనే కుమారుల పయనం

2011లో కేవలం 10, 12 పశువులతో మణిబెన్ జేసుంగ్ చౌదరి పాల ఉత్పత్తి ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు బన్నీ, మెహ్సాని, ముర్రా గేదెలు, హెచ్‌ఎఫ్ ఆవులు, స్వదేశీ కంక్రేజ్ జాతులు ఆమె డెయిరీలో ఉన్నాయి. మణిబెన్ ముగ్గురు కుమారులు గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ.. వారు పూర్తిగా ఈ పాడి పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. ఆధునిక మిల్కింగ్ యంత్రాల సహాయంతో ఆవులు, గేదెలకు పాలు పితుకుతూ తల్లికి తోడుగా నిలుస్తున్నారు.
News January 14, 2026
KNR: 6 నెలలకోసారి వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళలు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను ఆమె సందర్శించారు. ఈ దవాఖానాలో నిర్వహిస్తున్న ‘ఆరోగ్య మహిళా వైద్య’ పరీక్షలను పరిశీలించారు. పలువురు మహిళలకు బీపీ పరీక్షలు చేయించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


