News April 25, 2024

మెదక్: ఎండలతో ప్రచారం కష్టమే..

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచార పర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం, ఎండలు మండిపోతుండడంతో అభ్యర్థులకు సవాల్‌గా మారింది.

Similar News

News July 11, 2025

మెదక్: ఆపరేషన్ ముస్కాన్.. 8 కేసులు నమోదు: ఎస్పీ

image

ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల వద్ద పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.

News July 10, 2025

MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

image

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 10, 2025

మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.