News January 5, 2026
వేములవాడ: ఆలయ రిటైర్డ్ ప్రధాన అర్చకుడు కన్నుమూత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు అప్పాల భీమాశంకర శర్మ (65) అనారోగ్యంతో కన్నుమూశారు. వేములవాడలో అర్చక ప్రముఖులలో ఒకరైన భీమాశంకర శర్మ (భీమన్న) ఆలయ ఇన్చార్జి స్థానాచార్యగా పని చేసి ఆగస్టులో పదవీ విరమణ చేశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ, బ్రాహ్మణ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 20, 2026
అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు!

AP: YCP MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఇవాళ శాసనమండలి సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే అనంతబాబు భార్య కోసం పోలీసుల గాలిస్తున్నారు. తమ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో భర్తను ప్రేరేపించడమే కాకుండా అన్ని విధాలా ఆమె సహకరించారని సిట్ పేర్కొంది.
News February 20, 2026
KNR: ‘మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలి’

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్ ఆవరణలోని జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మ్యూజియం పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మ్యూజియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
News February 20, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.


