News January 5, 2026

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి 85 ఫిర్యాదులు

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ప్రజల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సంబంధిత ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News February 13, 2026

పాడేరు: పీజీఆర్‌ఎస్‌కు 109 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 109 ఫిర్యాదులు, రెవెన్యూ క్లినిక్‌కు 16 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News February 13, 2026

కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్‌ కరీంనగర్‌ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.

News February 13, 2026

అల్లూరి: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

image

అడ్డతీగల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. డీఎంహెచ్‌వో సరిత ఆసుపత్రికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం వారి పరిస్థితి బాగుండడంతో అయిదుగురిని డిశ్చార్జ్ చేశారన్నారు. హాస్టల్లో 24 గంటలు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.