News January 5, 2026
GST పన్నుల వాటా చెల్లింపులో కేంద్రం వివక్ష: జూపల్లి

TG: GST సంస్కరణలు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లున్నాయని మంత్రి జూపల్లి విమర్శించారు. ‘నిధుల కేటాయింపులో కేంద్రం రాజకీయం చేస్తోంది. TG నుంచి పన్నుల కింద ఏటా ₹2,02,369 కోట్లు ఇస్తుంటే తిరిగిచ్చేది ₹55,630 కోట్లే. రాష్ట్రానికో రకంగా నిధులిస్తోంది’ అని అసెంబ్లీలో GST సవరణ బిల్లు చర్చలో మండిపడ్డారు. కేంద్రం తీరుపై MIM, BJP మధ్య వాగ్వాదం జరిగింది. MIM వాకౌట్ చేయగా BILLను సభ ఆమోదించింది.
Similar News
News February 17, 2026
అప్పుడు క్లీన్‌స్వీప్.. ఇప్పుడు జీరో!

TG: సర్పంచ్ ఎన్నికల్లో కాస్త సత్తా చాటిన BRS మున్సిపల్ ఎన్నికల్లో చతికిలపడింది. 7 కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా మేయర్ <<19160296>>పదవి<<>> దక్కించుకోలేకపోయింది. 2020లో ఆ పార్టీ పదికి పది కార్పొరేషన్లు సొంతం చేసుకోవడం గమనార్హం. అటు 116 మున్సిపాలిటీల్లో 18 చోట్ల మాత్రమే ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఇందులోనూ 13 స్థానాల్లో పూర్తి మెజార్టీ ఉండగా మిగతా 5 చోట్ల కాంగ్రెస్, ఇతరులతో పొత్తు పెట్టుకొని పదవులు దక్కించుకుంది.
News February 17, 2026
‘కుతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజలు లేవు’

కొందరు వ్యక్తులు తమకు అన్నీ తెలుసని, తాము చాలా గొప్పవారమని గంభీరమైన మాటలు చెబుతుంటారు. కానీ పని అప్పగిస్తే ఏమీ చేయలేరు. అలాగే పెద్ద కుప్పలా ఉన్న ధాన్యాన్ని గాలికి ఎగబోసేటప్పుడు అందులో నుంచి శబ్ధం(కుతల) వస్తుంది. తీరా చూస్తే అందులో అసలైన గింజలు (ధాన్యం) లేకుండా, కేవలం పొట్టు లేదా తాలు మాత్రమే ఉంటే “వట్టి కుతల ఆర్భాటమే తప్ప, కుప్పలో గింజలు లేవు” అనే సామెతను రైతులు వాడుతుంటారు.
News February 17, 2026
అధిక మాసం ఎలా ఏర్పడుతుందో తెలుసా?

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. అయితే చంద్రుని గమనం ఆధారంగా 12 మాసాలకు 354 రోజులు పడుతుంది. ఈ రెండింటి మధ్య ఏటా వచ్చే 11 రోజుల తేడాను సవరించడానికి ప్రతి మూడేళ్లకు ఓసారి ఓ నెలను అదనంగా కలుపుతారు. దీనినే అధిక మాసం అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. ఇది పండుగలు, రుతువుల క్రమం తప్పకుండా ఉండటానికి సహాయపడుతుంది.


