News April 25, 2024

GREAT.. మన సంగారెడ్డి యువకుడు సైంటిస్ట్ అయ్యాడు

image

ఝరాసంగం మండలం కమాల్‌పల్లికి చెందిన శ్రీశైలం వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో చదివిన శ్రీశైలం.. ISRB నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. అరుణాచల్‌ప్రదేశ్ కేడర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ఏఎస్‌ఆర్‌బీ)గా ఉద్యోగం సాధించారు. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగం పాఠశాలలో జరిగింది. -CONGRATS

Similar News

News January 21, 2026

మెదక్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News January 21, 2026

మెదక్: టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ పురపాలక సంఘంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు నిన్న చేసిన సూచన మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 32 వార్డుల నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ స్వీకరించారు. మాజీ ఛైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు.

News January 21, 2026

మెదక్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడమే ప్రజాపాలనా? హరీష్ రావు

image

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణమన్నారు. అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.