News January 5, 2026
కడప పోలీస్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
Similar News
News February 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.
News February 17, 2026
నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.