News January 5, 2026
బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై హింస ఆగడం లేదు. తాజాగా మరో వ్యక్తి గురయ్యాడు. మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ బైరాగి(45)ని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ఇతడి తండ్రి స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఖోకన్ దాసి, అమృత్ మండల్, దీపూ దాస్ వంటి <<18749458>>హిందువులు<<>> మూక దాడుల్లో హతమైన సంగతి తెలిసిందే. వరుస ఘటనలతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. తాజాగా హిందూ మహిళపై రేప్ ఘటన వెలుగుచూసింది.
Similar News
News February 25, 2026
కొత్త పెన్షన్లపై శుభవార్త

AP: కొత్త పింఛన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న సండే కావడంతో FEB 28నే పెన్షన్లు <<19230790>>అందజేయనున్నట్లు<<>> ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76L మందికి ₹2,725Crను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు ₹4K, దివ్యాంగులకు ₹6K, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ₹10K, మంచానికే పరిమితమైన వారికి ₹15K ఇస్తున్న విషయం తెలిసిందే.
News February 25, 2026
చైనా అండతో USను టార్గెట్ చేసిన ఇరాన్!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఆ దేశ తీరానికి సమీపంలో మోహరించాయి. దీనికి కౌంటర్‌గా ఇరాన్.. చైనా నుంచి సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే డీల్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. వీటితో 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను అటాక్ చేయవచ్చు. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం.
News February 25, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.


