News January 5, 2026
U19: సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

టీమ్ ఇండియా U-19 జట్టు సౌతాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత SA 49.3 ఓవర్లలో 245 స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో కెప్టెన్ వైభవ్(24 బంతుల్లో 68 రన్స్) దూకుడుతో IND 11 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 103 రన్స్ చేసింది. వర్షం కారణంగా అంపైర్లు టార్గెట్‌ను 27 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించగా 23.3 ఓవర్లలోనే IND లక్ష్యాన్ని ఛేదించింది. అరోన్ 20, త్రివేది 31*, అభిజ్ఞాన్ 48* రన్స్ చేశారు.
Similar News
News January 9, 2026
గత పాలకులు ఏమీ చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు: పవన్

AP: పనిచేసే నాయకులకు అండగా నిలవాలని Dy.CM పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు ఏమీ చేయకుండా తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలికని, నిర్మించడమే కష్టమని పేర్కొన్నారు.
News January 9, 2026
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై HCలో పిటిషన్

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ టికెట్ ధరల <<18804706>>పెంపును<<>> సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ దీన్ని సింగిల్ బెంచ్ జడ్జి వద్ద మెన్షన్ చేశారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో ఇచ్చిందని పేర్కొన్నారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. కాగా నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేశారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
News January 9, 2026
అందరికీ అండగా ఉండే అచ్యుతుడు

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥
దేవుడు దయామయుడు. భక్తులపై అనుగ్రహం చూపుతూ కోరిన వరాలిస్తాడు. విశ్వాన్ని రక్షిస్తాడు. సత్కర్మలు చేసేవారిని గౌరవిస్తూ, సాధువులకు అండగా ఉంటాడు. తనను నమ్మిన వారిని చేయి పట్టి నడిపిస్తూ, పరమపదానికి చేరుస్తాడు. సర్వవ్యాపియైన ఆ నారాయణుడు ప్రతి జీవిలోనూ ఉండి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


