News April 25, 2024

VZM: పోక్సో కేసులో నిందితుడికి జైలు

image

విజయనగరం దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. పూసపాటిరేగ మండలం కృష్ణాపురానికి చెందిన జి.రాంబాబు(27)పై 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారని దిశా స్టేషన్ ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు.

Similar News

News April 1, 2026

క్రికెట్ బెట్టింగులపై కఠిన చర్యలు: VZM ఎస్పీ

image

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా SP ఏ.ఆర్.దామోదర్ మంగళవారం హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగుల జోలికి పోవొద్దని ఆయన సూచించారు. బెట్టింగులు చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్లు కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగులతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని SP సూచించారు.

News March 31, 2026

జూన్‌లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై మంగళవారం హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో 3,161 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

News March 31, 2026

VZM: ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

image

జిల్లాలో నిర్మాణంలో గల ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నిర్మాణంలో గల భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి ఆసుపత్రుల నూతన భవనాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.