News January 5, 2026
BREAKING: వరంగల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి వంశీ వర్మ (పెద్దపల్లి జిల్లా) మామునూరులోని తన అద్దె గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 7, 2026
ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
News February 7, 2026
NZB: పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లోని ఐడీఓసీలో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
News February 7, 2026
భూపాలపల్లిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సభ: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లిలో ఆదివారం నిర్వహించనున్న CM రేవంత్ రెడ్డి బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం ఆయన సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ‘ప్రజా పాలన – ప్రగతిబాట’లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.


