News January 5, 2026

సర్వదర్శనానికి 8 గంటల సమయం

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి సుమారు 8గంటల టైం పడుతుందని రాత్రి 9 గం.కు TTD ప్రకటించింది. ప్రస్తుతం నారాయణగిరి షెడ్లు 4లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

Similar News

News January 14, 2026

‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

image

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.

News January 14, 2026

ఉదయాన్నే అలసటగా అనిపిస్తుందా?

image

ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, అలసటగా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. నిద్ర సరిపోకపోవడం, శరీరంలో నీరు తగ్గడం, విటమిన్-D లోపం, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ గోరువెచ్చని నీరు తాగడం, సరైన నిద్ర, ఉదయం ఎండలో కూర్చోవడం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. అయినా అలసట తగ్గకపోతే వైద్య సలహా తప్పనిసరి.

News January 14, 2026

అమెరికాలో 51వ రాష్ట్రం అవ్వనున్న గ్రీన్‌లాండ్!

image

డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును US కాంగ్రెస్‌లో రిపబ్లికన్ మెంబర్ ర్యాండీ ఫైన్ ప్రవేశ‌పెట్టారు. ‘గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్’ బిల్లు ఆమోదం పొందితే, ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకునే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా అయినా దక్కించుకుంటామని <<18784880>>ట్రంప్<<>> ఇప్పటికే స్పష్టం చేశారు.