News January 5, 2026

ఈనెల 9న భైంసాకు కేంద్ర మంత్రి బండి సంజయ్

image

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 9న భైంసా పట్టణంలో పర్యటించనున్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆయన, రెండోసారి భైంసాకు వస్తుండటంతో స్థానిక శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News January 25, 2026

NGKL: విద్యుత్ డీఈ శ్రీధర్ శెట్టి సస్పెన్షన్

image

తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి లోకేష్ విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై డీఈ శ్రీధర్ శెట్టితోపాటు లైన్ మెన్ ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీరాములుకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న ఈ ఘటన జరగడంతో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

News January 25, 2026

జనగామ కలెక్టర్‌కు పురస్కారం

image

జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి, శిక్షణ, సామర్థ్య పెంపు విభాగంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

News January 25, 2026

సిరిసిల్ల: పోలింగ్ శాతం పెంచేందుకు అధికారుల కృషి

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో అధికారులు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 4,76,187 మంది ఓటర్లు ఉండగా 2,30,294 పురుషులు, 2,45,849 మంది మహిళలు, ఇతరులు 44మంది ఉన్నారు. ఓటు వేసేందుకు గ్రామీణ ఓటర్లు ఆసక్తి చూపుతున్నా పట్టణ ఓటర్లు ముందుకు రాకపోవడంతో 90% పోలింగ్ దాటడంలేదు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాల్సిందే.