News January 5, 2026
ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి: కలెక్టర్

భూపాలపల్లి సమీకృత కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉదయం హాజరైన వెంటనే, సాయంత్రం వెళ్లేటప్పుడు రెండుసార్లు హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే CCA ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 15, 2026
పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.
News January 15, 2026
సూర్య మూవీకి రూ.85 కోట్ల OTT డీల్!

హీరో సూర్య, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.85 కోట్లకు OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యధికమని సమాచారం. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య లాస్ట్ మూవీ ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయిన మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.
News January 15, 2026
KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.


