News January 6, 2026

మేడారం విధుల్లో నిబంధనలు తప్పనిసరి: ఈడీ

image

మేడారం జాతర స్పెషల్ బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లు క్రమశిక్షణతో వ్యవహరించాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సోలొమాన్ స్పష్టం చేశారు. సోమవారం ములుగు రోడ్డులోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం తాగి, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై నిఘా ఉంటుందని హెచ్చరించారు. ప్రమాదం సంభవిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Similar News

News January 11, 2026

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

image

సంక్రాంతి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి ధీరజ్ ఒక ప్రకటనలో కోరారు. పండగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.

News January 11, 2026

తాగునీటి భద్రతకు బల్దియాలో ‘వాటర్ రింగ్ మెయిన్’

image

బల్దియా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా జలమండలి భారీ కసరత్తు మొదలుపెట్టింది. రూ.7,200CRతో 158KM ‘వాటర్ రింగ్ మెయిన్’కు రూపకల్పన చేసింది. నగరం చుట్టూ జలవలయంగా పైపులైన్ ఏర్పాటు చేసి గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్, హిమాయత్‌సాగర్ వనరులను క్లోజ్డ్ లూప్ విధానంలో అనుసంధానించనుంది. 18KM పనులు పూర్తవగా, మిగిలిన పనులకు DPRతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. నగర భవిష్యత్ నీటి అవసరాలకు ఇది కీలకం కానుంది.

News January 11, 2026

తెలంగాణలో కాకినాడ జిల్లా యువకుడి అరెస్ట్

image

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడిపికొండ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బండి నూతన ప్రసాద్(20) కాకినాడ జిల్లా చిన్నయ్యపాలెం వాసిగా గుర్తించారు. NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.