News April 25, 2024
కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. tsbie అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
News April 25, 2025
అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
News April 25, 2025
పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.