News January 6, 2026

పీజీఆర్‌ఎస్‌లో 13 అర్జీలు స్వీకరించిన ఎస్పీ

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జిల్లా నలుమూలల నుంచి 13 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధమవ్వండి: జేసీ ఆదేశం

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రీ-సర్వే అంశాలనూ వేగవంతం చేయాలన్నారు.

News January 23, 2026

భీమవరం: ఇసుక కొరత ఏర్పడకూడదు.. కలెక్టర్ ఆదేశం

image

పెదఅమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1,32,954 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు.

News January 23, 2026

భీమవరం: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి, అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.