News April 25, 2024

రూ.25 వేల నాణేలతో నామినేషన్

image

TG: ఎన్నికల వేళ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. పేరాల మానసా రెడ్డి అనే మహిళా అభ్యర్థి తన నామినేషన్ వేసేందుకు డిపాజిట్ కింద చెల్లించాల్సిన రూ.25 వేలను చిల్లర రూపంలో చెల్లించారు. రూపాయి నుంచి పది రూపాయల వరకు నాణేలను గంపలో తీసుకొచ్చి నామినేషన్ వేశారు.

Similar News

News March 18, 2026

ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

image

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

News March 18, 2026

త్వరలో విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

image

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.