News January 6, 2026

దేశీ ఆవుల్లో కనిపించే ప్రత్యేక లక్షణాలివే..

image

దేశీ ఆవుల్లో ఇతర ఆవులు, గేదెలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలుంటాయి. దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు. స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. పాలు తీసేటప్పుడు గేదె తన పొదుగులో ఉన్న పాలను మొత్తం ఇచ్చేస్తుంది. ఆవు అలా కాదు. తన పిల్ల కోసం పొదుగులో కొంచెం పాలను దాచి, పిల్ల తాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. దేశీ ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఎక్కువ. గేదెలు ఎండలను తట్టుకోలేవు. ఆవులు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలవు.

Similar News

News February 22, 2026

సెంట్రల్ ఎలక్ట్రో‌కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BTech/MTech(కెమికల్ ఇంజినీరింగ్), PhD(ఫిజికల్/కెమికల్ సైన్సెస్), BSc(కెమిస్ట్రీ) అర్హతగల వారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు. మార్చి 6న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. సైట్: www.cecri.res.in/

News February 22, 2026

తడి బట్టలతో పూజ చేయవచ్చా?

image

దైవకార్యాల్లో తడి బట్టలు ధరించకూడదు. అలా చేస్తే పితృదేవతలు ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. ‘తడి బట్టల నుంచి కారే నీరు పితరులకు వెళ్తుందని, తద్వారా వారు అసంతృప్తి చెందితే సంతాన, సంపద లోపం కలుగుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. తడి బట్టలతో ఆలయ ప్రవేశం, పూజ చేయడం మహా పాపం. అపర కార్యాలకు మాత్రమే తడి బట్టలు నిషిద్ధం కాదు. కాబట్టి ఎప్పుడూ పొడి బట్టలతోనే పూజలు నిర్వహించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News February 22, 2026

ఉగ్రకుట్రకు ప్లాన్?.. ఎనిమిది మంది అరెస్ట్

image

మరోసారి ఉగ్రదాడి జరగొచ్చన్న సమాచారంతో <<19199047>>ఢిల్లీ పోలీసులు<<>> అలర్ట్ అయ్యారు. తమిళనాడులో ఆరుగురు, ప.బెంగాల్‌లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ISI, బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మద్దతుతో వీరు ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ 8 మందిలో బంగ్లాకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. వారి నుంచి ఫోన్లు, సిమ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.